హైదరాబాద్ సెయిలింగ్ వీక్
హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: హైదరాబాద్ సెయిలింగ్ వీక్‌లో యువ సెయిలర్ రితిక దంగి జోరు కొనసాగిస్తోంది. ఐఎల్‌సీఏ మహిళల విభాగం లో.. ఏడు, ఎనిమిది, తొమ్మిదో రేసుల్లో రితిక అగ్రస్థానంలో నిలిచింది. హుస్సే న్ సాగర్ వేదికగా జరుగుతున్న 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్‌లో అలలపై అద్భుత విన్యాసాలతో రితిక ముందంజలో నిలిచింది. ఐఎల్‌సీఏ ఓపెన్ కేటగిరీలో బిక్రమ్ మహాపాత్రా రెండు రేసుల్లో అగ్రస్థానం దక్కించుకోగా.. మరో రేసులో రితిక సత్తాచాటింది. ఐఎల్‌సీఏ 7లో మోహిత్ సైనీ రెండు రేసుల్లో ముందంజలో నిలిచాడు. 470 మిక్స్‌డ్ ఈవెంట్‌లో శారద వర్మ, ఆర్కే శర్మ మంచి ప్రదర్శన కనబర్చారు.