హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: అలలపై తేలిఆడుతూ సాగే సెయిలింగ్‌లో రితిక సత్తాచాటింది. హుస్సేన్ సాగర్ వేదికగా జరుగుతున్న 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పోటీల్లో రితిక రెండు విభాగాల్లో రాణించింది. ఐఎల్‌సీఏ 6 మహిళల కేటగిరీతో పాటు.. ఓపెన్ విశభాగంలో రితిక అగ్రస్థానంలో నిలిచింది. ముంబై సెయిలింగ్ క్లబ్‌కు చెందిన రితిక సెయిలింగ్ పోటీల రెండో రోజు చక్కటి ప్రదర్శన కనబర్చింది. ఐఎల్‌సీఏ 7 విభాగంలో మోహిత్ సైనీ, 470 మిక్స్‌డ్ టీమ్ విభాగంలో శారధ, ఆర్కే శర్మ, ఐఎల్‌సీఏ4 బాలుర విభాగంలో అంకిత్ సింగ్ సిసోడియా, ఐఎస్‌సీఏ4 బాలికల విభాగంలో సౌమ్య సింగ్ పటేల్ విజేతలుగా నిలిచారు.