calender_icon.png 26 October, 2024 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిష్ స్పాతో పొంచి ఉన్న ప్రమాదం

28-05-2024 12:05:00 AM

అందంగా కనిపించాలని ప్రతిరోజూ చాలా మంది వివిధ రకాల చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ముఖ సౌందర్యాన్ని పెంచేందుకు మార్కెట్‌లో ఎన్నో చికిత్సలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇదే తరహా పాదాలను అందంగా మార్చేందుకు కొత్త కొత్త ఉత్పత్తులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఫేస్, హెయిర్ స్పా గురించి విన్నాం. అయితే ప్రస్తుతం ఫిష్ స్పా కూడా మార్కెట్‌లో బాగా పాపులర్ అయ్యింది. ఫిష్ స్పాలు మాల్స్‌లో, హెయిర్ పార్లర్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఫిష్ స్పాల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో... దుష్ప్రభావాలు కూడా అన్నే ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. అవెంటో తెలుసుకుందాం.

ఉపయోగాలు

1. ఫిష్ పెడిక్యూర్ స్పా చేయించుకున్న వారు మానసికంగా రిలాక్స్‌గా ఉంటారు.

2. పాదాలను అందంగా మార్చేందుకు ఫిష్ స్పా ఉపయోగపడుతుంది.

3. పాదాల చర్మాన్ని మృదువుగా, అందంగా మార్చేందుకు ఫిష్ స్పా ఓ బ్యూటీ ట్రీట్‌మెంట్

దుష్ప్రభావాలు

1. ఫిష్ స్పా తీసుకోవడం వల్ల వివిధ తీవ్రమైన వ్యాధులు సోరియాసిస్, ఎగ్జిమాలాంటివి వస్తాయి.

2. సోరియాసిస్, ఎగ్జిమా వ్యాధులు ఉన్న వారిని చేపలు కొరికి తర్వాత వేరే వారిని కొరికితే ఈ వ్యాధులు సంక్రమించే ప్రమా దం పెరుగుతుంది.

3. ఫిష్ స్పా చేయించుకునే వారికి స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం చాలా రేట్లు ఎక్కువ

4. ఫిష్ స్పా చేసేటప్పుడు చేతివేళ్లు, కాలి గోళ్లు దెబ్బతింటాయి.