డా. బుర్ర మధుసూదన్ రెడ్డి :
దేశవ్యాప్తంగా 117 బిలియన్ డాలర్ల విద్యా వ్యాపారం జరుగుతూ రోజురోజుకు వేగంగా పెరుగుతున్నది. డిగ్రీ పట్టా లు సులభంగా లభిస్తున్నప్పటికీ ఉత్తీర్ణులైన యువతలో ఉద్యోగ సాధన నైపుణ్యా లు అడుగంటి పోతూ, నిరుద్యోగం క్రమం గా పెరుగుతున్నది. అధికారిక గణాంకాల ప్రకారం 2021-- దేశవ్యాప్తంగా 1,450కి పైగా యూనివర్సిటీల ద్వారా 1.07 కోట్ల విద్యార్థినీ విద్యార్థులు డిగ్రీ పట్టాలు పొందుతున్నారు. అయితే, యూ జీ పూర్తి చేసిన యువతలో 12 శాతం వరకు మాత్ర మే పీజీ కోర్సుల్లో ప్రవేశాలను పొందుతూ ఉన్నత చదువులు కొనసాగిస్తున్నారు.
డిగ్రీ పొందిన యువతలో ఎక్కువ మంది సాం ప్రదాయ బీఏ, బీకాం, బీఎస్సీ, లా, ఇంజినీరింగ్, మెడిసిన్, మేనేజ్‌మెంట్ లాంటి కోర్సులు పూర్తి చేస్తున్నట్లు గుర్తించారు. డిగ్రీ, పీజీ పట్టాలు పొందిన యువ భారతీయులు ఉద్యోగ ఉపాధులు కొరవడి డిగ్రీ సర్టిఫికెట్లు వట్టి కాగితాలుగా మారి యువతను ఎగతాళిగా, జాలిగా చూస్తున్నాయి. ప్రతి ఏటా దేశంలో దాదాపు 15 లక్షల వరకు ఇంజినీరింగ్ పట్టాలు పొందిన యువత ఉద్యోగాల వేటలో విఫల యత్నా లు చేస్తూ నీరసపడి పోతున్నారు.
సంక్షోభ సమయం
ప్రతి ఏటా కోటికి పైగా యువత డిగ్రీ లు పొందుతున్నప్పటికీ వేలల్లో కూడా అర్హతకు తగిన ఉద్యోగాలు దొరకడం లేదు. కనీసం అటెండర్, గుమాస్తా లాంటి తక్కువ వేతనం కలిగిన ఉద్యోగాలు కూడా లభించడం లేదు. సాలీనా కోట్లాది విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర బోర్డు పరీక్షలద్వారా సర్టిఫికెట్లు పొందుతుండగా, అందులో 50 శాతం యువత ఉన్నత చదువులు చదువుకోలేక ఉద్యోగ, ఉపాధుల వేటలో వ్యర్థ జీవితాలు గడుపుతున్నారు.
పాఠశాలల్లో ఉపాధ్యాయ అర్హత కలిగిన బీ.ఎడ్, డీ.ఎడ్ పట్టాలు పొందిన యువత చాలామందే ఉన్నప్పటికీ వారి లో కొద్ది శాతానికి కూడా ఉద్యోగాలు లభించడం లేదు. ఒకవేళ లభించినా కనీ సం రూ.10,000 నెలసరి వేతనం కూడా కరవైంది. ఉన్న కొద్దిపాటి ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ఆశ్రిత పక్షపా తం, రాజకీయ జోక్యం, అవినీతి వంటి వాటివల్ల జ్ఞాన సంపన్నులైన అర్హులకు ఉద్యోగాలు దొరకడం లేదు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో బయటపడ్డ ఉపాధ్యాయ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ కుంభకోణంలో వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు తేలడం విచారకరం.
2022లో సీబీఎస్‌సీ ఉత్తీర్ణత పొంది న విద్యార్థులు 19.77 లక్షలమంది ఉన్నా రు. దేశంలో ఉన్నత విద్య పొంది న యువత దాదాపు 37.4 మిలియన్లు ఉండగా, ప్రతి ఏటా 1.5 లక్షలకు పైగా విద్యార్థులు ఎంబీబీఎస్ పట్టాలు పొం దుతున్నారు. ఎంబీబీ ఎస్ పూర్తి చేసిన యువతలో కొద్దిమంది పీజీ కోర్సుల్లో, మరి కొద్దిమంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ఎక్కువ మంది వైద్యులు ప్రైవే ట్ ఆసుపత్రుల్లో తక్కువ వేతనానికిపని చేస్తున్నా రు. మరోవైపు ప్రతి ఏటా 15 లక్షలమం ది యువత ఇంజినీరింగ్ పూర్తి చేస్తుండగా, వారిలో దాదాపు 33 శాతం ఇంజి నీర్లు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నా రు. ఇటీవల ఓ అంతర్జాతీయ సంస్థ నివేదిక రానున్న రోజుల్లో యువ భారత్‌లో నిరుద్యోగ సంక్షోభం రానుందని హెచ్చరించింది.
నాణ్యమైన విద్య నల్లపూసే
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బోర్డులు నాణ్యమైన విద్యను అందించడంలో విఫలమవు తున్నాయి. విద్యకు, ఉద్యోగాలకు సంబం ధం లేకుండా పోయింది. విద్యలో నాణ్య తా లోపంతోపాటు నైపుణ్యం కరవవడం తో నిరుద్యోగాలు కోట్లలో చేరుతున్నాయి. ఉద్యోగ సాధన, ఉద్యోగంలో నిలదొక్కుకునే సాంకేతిక నైపుణ్యా లు లేక యువత నిరుత్సాహ సంద్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. అసంబద్ధ పారిశ్రామిక ప్రగతి, నిరంతర వలసలు కూడా నిరుద్యోగం పెరగడానికి కారణమవుతున్నాయి. అనుభవ యువత కావాలని పరిశ్రమలు అంటుంటే, ఉద్యోగం కల్పించకుండా అనుభవం ఎలా వస్తుందని యువత అంటారు. ఇలా ఎవరికి వారు వాదనలు చేస్తున్నారు. నిరుద్యో గ యువత నిరాశలో పడితే, దేశంలో సామాజిక అశాంతి నెలకొంటుంది.
తెలంగాణలోనూ అదే పరిస్థితి
సెకండరీ విద్య, ఆపై ఉన్నత చదువులు చదివిన తెలంగాణలోని యువత ఎక్కువగా నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటు న్నట్లు ఇండియా ఎంప్లాయ్‌మెంట్ రిపోర్ట్-- నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం 15---29 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారిలో 30.3 శాతం అమ్మాయిలు, 18.3 శాతం అబ్బాయిలు, మొత్తంగా 48.6 శాతం మంది నిరు ద్యోగులుగా ఉన్నారు. జాతీయ స్థాయి లో ఇదే కేటగిరీలో చూస్తే ఇది 65.7 శాతంగా ఉంది. రాష్ట్రంలో 2005 నుంచి యువతలో నిరుద్యోగిత శాతం క్రమంగా పెరుగుతున్నదని ఈ నివేదిక వెల్లడించింది. 2005లో యువతలో నిరుద్యోగం 14.1 శాతం ఉండ గా, 2012 కల్లా అది 14.9 శాతానికి, 2019 నాటికి 34.9 శాతానికి చేరుకుంది.
అయితే, 2022లో మాత్రం ఇది 21.7 శాతానికి తగ్గుముఖం పట్టింది. ఆ ఏడాది అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు ఉద్యోగావకాశాలు అధికంగా సాధించారు. నిరు ద్యోగిత శాతం అబ్బాయిల్లో 18.3 శాతం ఉండగా, అమ్మాయిల్లో అది 30.3 శాతంగా ఉంది. అయితే, దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణ సాంకేతికంగా, టెక్ స్కిల్స్‌లో ఉన్నత స్థాయిలో ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ, అది నిజం కాదని చాలా మంది ఇంజినీర్ పట్టా పొంది న యువతరం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేదా కంప్యూటర్ ప్రోగ్రామ్ కూడా రాయలేకపోతున్నారని ఆ నివేదిక పేర్కొంది.
2030 నాటికి తొమ్మిది కోట్లు
యువ భారతంలో యువశక్తి నైపుణ్య నిధిగా మారితే పారిశ్రామిక రంగం దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతుందనే ది వాస్తవం. మేధో వలసతో భారతీయ యువత విదేశాల్లో కూడా రాణించడం, స్థిరపడడం చూస్తున్నాం. 2030 నాటికి కనీసం 9 కోట్ల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వాలు పథక రచనలు చేయాల్సి ఉంటుంది. 10 లక్షల ఖాళీ ఉద్యోగాలను 2023 నాటికి నింపనున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రక టించింది. అయితే, ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేసిందో తెలియదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్’ పథకం ద్వారా యువతను అగ్నివీరులుగా రక్షణశాఖలో తీసు కోవాలనే నిర్ణయానికి మొదట్లో కొంత వ్యతిరేకత కనిపించినా కొద్ది రోజుల్లోనే రికార్డు స్థాయిలో యువకులు దరఖా స్తులు చేసుకున్నారు.
ప్రైవేట్ రంగంలో ఊబర్, ఓలా డ్రైవర్స్, జోమాటో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ డెలివరీ వర్కర్స్ లాంటి ఈ--కామర్స్ సంస్థల ద్వారా పలు రకాల తక్కువ వేతన ఉద్యోగాలు కల్పితం కావడం వల్ల గిగ్ వర్కర్లు ఆర్థిక వ్యవస్థకు కొంతమేరకు ఊపిరి పోస్తున్నారు. ‘నీతి ఆయోగ్’ అంచనాల ప్రకారం 2029 నాటికి 2.35 కోట్లమంది గిగ్ వర్కర్స్ ఉద్యోగాలు పొందనున్నా రు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాల ప్రభుత్వాలు ఉద్యోగ ప్రకటన లు చేయడం జరిగినా భర్తీ ప్రక్రియ పూర్తి చేయడానికి కావలసిన సత్వర చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయి. దేశ ఉత్పత్తి రంగం, మౌలిక వసతు ల కల్పన, అవినీతి రహిత వ్యవస్థలు, విదేశీ నిధుల ఆకర్షణ, ఉన్న ఖాళీలను గుర్తించడం లాంటివి సత్వర అవసరంగా గుర్తించా లి. యువత అత్యధికంగా ఉన్న భారత్ ప్రపం చ దేశాలకే దేదీప్యమాన దీపస్తంభం కావాలంటే పట్టాలు కలిగిన యువశక్తికి పట్టాభి షేకం జరగాల్సిందే.
వ్యాసకర్త సెల్: 9949700037