calender_icon.png 14 October, 2024 | 5:56 AM

మైనర్లపై పెరుగుతోన్న లైంగిక హింస

14-10-2024 03:51:56 AM

బాధితులుగా 37 కోట్ల మంది బాలికలు

తెలిసినవారి నుంచే వేధింపులు అధికం

నాన్ కాంటాక్ట్ వేధింపులు మరింత ఎక్కువ

యూనిసెఫ్ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: మహిళలు, బాలికలపై నానాటికీ లైంగిక వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయని యూనిసెఫ్ నివేదిక వెల్లడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 37 మంది కోట్ల మందికిపైగా తమ చిన్నతనంలో అత్యాచారం లేదా లైంగిక వేధింపులకు గురైనట్లు ఈ రిపోర్టు పేర్కొంటుంది.

18 ఏళ్ల లోపువారిలో ప్రతి 8 మందిలో ఒక బాలిక లైంగిక వేధింపులకు గురవుతోందని తెలిపింది. అంతర్జాతీయ, ప్రాంతీయ స్థాయిలో మొదటిసారిగా పిల్లలపై లైంగిక హింసకు సంబంధించిన నివేదికను మొదటిసారి యూనిసెఫ్ విడుదల చేసింది.

యుక్త వయసులోని బాలికలు ఈ వేధింపులకు గురికావడం వల్ల జీవితకాలం పాటు చిక్కుల్ని తెచ్చిపెడుతున్నాయని రిపోర్టు నివేదించింది. నివేదిక ప్రకారం ఈ సంఖ్య కేవలం ప్రత్యక్షంగా వేధింపులను ఎదుర్కొంటున్నవారివే. ఆన్‌లైన్, మాటల రూపం (నాన్ వేధింపులను చేర్చితే బాధితుల సంఖ్య 65 కోట్లకు పెరుగుతందని యూనిసెఫ్ నివేదిక వెల్లడించింది. 

సన్నిహితుల నుంచే అధికం

నాన్ కాంటాక్ట్ వేధింపులను ప్రతి ఐదుగురి బాలికల్లో ఒకరు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వేధింపులను నివారించేందుకు వ్యూహాలు అనుసరించాలని, ఇందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని నివేదిక నొక్కి చెప్పింది. లైంగిక వేధింపులు, హింస ఏ రూపంలో ఉన్నా అరికట్టాలని సూచించింది.

యూనిసెఫ్ ఈడీ క్యాథరీన్ రస్సెల్ మాట్లాడుతూ.. పిల్లలపై లైంగిక హింస మానవ నైతిక మనసాక్షికి మచ్చ. ఇది పిల్లల మనసులో లోతైన, శాశ్వత గాయాన్ని కలిగిస్తుంది. పిల్లలు తమకు తెలిసినవారి నుంచి, సురక్షితంగా ఉన్నామని భావించే ప్రదేశాల్లోనే వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఇది ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆఫ్రికాలోని సబ్ సహారా ప్రాంతంలో అత్యధికంగా 7.9 కోట్ల మంది (22 శాతం) బాధితులు ఉన్నారు. తూర్పు ఆగ్నేయాసియాలో 7.5 కోట్ల మంది, మధ్య 7.3 కోట్లు, ఐరోపా అమెరికాలో 6.8 కోట్లు, లాటిన్ అమెరికా ప్రాంతంలో 4.5 కోట్లు, ఉత్తరాఫ్రికా 2.9 కోట్ల, సముద్ర ప్రాంతాల్లో 60 లక్షల మంది బాలికలు లైంగిక వేధింపులకు గురైనట్లు నివేదిక వెల్లడించింది.  

బాలురపైనా హింస ఎక్కువే

చిన్నతనంలో ఇలాంటి హింసను ఎదుర్కొన్నవారు జీవితాంతం వేధనను భరిస్తున్నారు. లైంగికంగా సంక్ర మించే వ్యాధులతో పాటు డ్రగ్స్ వినియోగం, ఒంటరితనం, ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. తమపై దాడిని చెప్పుకోలేని వారు మరింత క్షోభ అనుభవిస్తున్నారు. బాలురపైనా లైంగిక వేధింపు లు భారీగా నమోదవతున్నాయి. ప్రతి 11 మందిలో ఒకరు లైంగిక దాడికి గురవుతున్నారు.

నాన్ కాంటాక్ట్ వేధింపులను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య 53 కోట్ల వరకు ఉంటుందని నివేదిక పేర్కొంది. నవంబర్‌లో కొల ంబియాలో పిల్లలపై హింసకు వ్యతిరేకంగా తొలి ప్రపంచస్థాయి మినిస్టిరి యల్ సమావేశం జరగనుంది. ఈ సదస్సులో బాధితులు, యువత, ప్రభుత్వ నేతలు, సామాజిక కార్యకర్తలు పాల్గొంటారు. లైంగిక హింసను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నివేదిక నొక్కి చెప్పింది.