calender_icon.png 2 February, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెరుగుతున్న రాజన్న ఆంధాన్

01-02-2025 11:15:11 PM

గుడిలో వివిధ వస్తువుల అమ్మకానికి వేలంతో రూ.28.7 లక్షల రాబడి...

హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలోని స్వయంభూ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి ఆదాయం పెరుగుతోంది. హుండీ ద్వారా వచ్చే రాబడి కాకుండా ఆలయంలో వివిధ వస్తువుల అమ్మకానికి ఏటా నిర్వహిస్తున్న వేలంతో ఆదాయం రెట్టింపవుతోంది. రానున్న మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే జాతరతో పాటు ఒక సంవత్సర కాలం లడ్డూ, పులిహోర, కొబ్బరికాయలు, ఇతర పూజాసామాన్ల అమ్మకానికి హక్కు కల్పించేందుకు శనివారం సాయంత్రం వేలం పాడగా రూ.27.7లక్షల ఆదాయం వచ్చింది. లడ్డూ, పులిహోర ప్రసాదాన్ని అమ్ముకునే హక్కును పోగుల సంతోష్ రూ.18లక్షలకు పొందారు. పూజా సామాగ్రి అమ్ముకునే హక్కును పోగుల అనిత రూ.7.1లక్షలకు పొందారు. తిరిగి ఆమే కొబ్బరికాయలు అమ్ముకునే హక్కును రూ.2.6 లక్షలకు దక్కించుకున్నారు. పచ్చికొబ్బరి, ఎండు కొబ్బరిముక్కలు, వస్త్రాలు పోగుచేసుకునే హక్కును మద్దె పర్శరాములు రూ.1లక్షకు పొందారు. గత ఏడాది కంటే ఈసారి వేలం ద్వారా అదనంగా రూ.3.36లక్షల ఆదాయం సమకూరింది. ఈ వేలంపాటలో దేవాదాయ శాఖ పర్యవేక్షణ అధికారి శ్రీధర్ రెడ్డి, ఆలయ ఈవో కిషన్ రావు పాల్గొన్నారు.