calender_icon.png 20 April, 2025 | 10:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేఈఈలో రిషి కళాశాల విజయకేతనం

20-04-2025 12:04:47 AM

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): రిషి ఐఐటీ అకాడమీ జేఈఈ మెయిన్స్‌లో అత్యుత్తమ ఫలితాలను సాధించింది. వెయ్యిలోపు ర్యాంకులు సాధించి తమకు మరెవరు సాటిలైరనే సాంకేతాన్ని పంపింది. రిషి ఐఐటీ అకాడమీ విద్యార్థుల ర్యాంకులు ఇలా.. ఎన్ రోహిత్‌రెడ్డి 308వ ర్యాంకు, జంగం శ్రీతులసి 927వ ర్యాంకు సాధించారని రిషి జూనియర్ కళాశాల చైర్మన్ చంద్రకళ వెంకట్ తెలిపారు.

సాయి సుజన్‌రెడ్డి 98.40 శాతం, ఎస్‌ప్రణీత్ కుమా ర్ 98.04 శాతం, సాయి అక్షయ 97.08 శాతం, తరుణ్ సాయి 96.76 శాతం సాధించడంతోపాటు 90 శాతానికిపైగా 36 మంది విద్యార్థులు, జేఈఈ అడ్వాన్స్‌కు 45 మంది విద్యార్థులు అర్హత సాధించారని చెప్పారు. 

ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ చంద్రకళ వెంకట్, అకాడమిక్ చీఫ్ అడ్వైజర్ వెంకటయ్య అభినందిం చారు. కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ డీన్ లక్ష్మారెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ డీన్ భూపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రసన్నకుమారి పాల్గొన్నారు.