కోల్‌కతా: ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ కొత్త కెప్టెన్‌గా భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎంపికయ్యాడు. గతేడాది జరిగిన మెగావేలంలో పంత్ (రూ. 27 కోట్లు) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
సోమవారం లక్నో సూపర్ జెయిం ట్స్ కొత్త జెర్సీని ఆవిష్కరించిన పంత్ మీడియాతో మాట్లాడాడు. ‘లక్నోతో ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నా. జట్టును విజయ పథం లో నడిపించేందుకు 200 శాతం కష్టపడతా’ అని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో పంత్ రెండోసారి కెప్టెన్‌గా పనిచేయనున్నాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారధ్య బాధ్యతలు నిర్వర్తించాడు. పూరన్, మయాంక్, రవి, ఆయు ష్ బదోనిలను లక్నో రిటైన్ చేసుకుంది.