26-03-2025 01:12:49 AM
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 25 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం లో ఒకతాయిలు రెచ్చిపోయారు. మంగళవారం తెల్లవారుజామున ప్రముఖ న్యాయవాది గండూరి కెఫా సంపత్ కుమార్ కు చెందిన వాహనంతో పాటు, మరో వాహనానికి నిప్పు పెట్టారు. న్యాయవాది సంపత్ కుమార్ కొత్తగూడెం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రామవరం లోని ఎస్ సి బి నగర్ నివాసి అయిన న్యాయవాది సంపత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తన పని ముగించుకొని ఎస్సిబి నగర్ లోని స్వర్ణ రెసిడెన్సి రెండవ అంతస్తులు నివాసముంటున్న తాను సుమారు రాత్రి 9:30 గంటల సమయంలో ఇంటి ముందు ఖాళీ స్థలంలో కారును పార్కింగ్ చేసి ఇంటికి వెళ్లి పడుకున్నాను.
మంగళవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో మూడవ అంతస్తులో నివాసం ఉంటున్న రాజయ్య తనకు ఫోన్ చేసి మీ కారు తగలబడుతుందని తెలుపగా కిందికి వచ్చి కారు మంటలు ఆర్పే ప్రయత్నం చేశాము. ఇంతలో మూడవ అంతస్తులో ఉన్న వీరు ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేయడంతో ఫైర్ ఇంజన్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.
తరువాత రెసిడెన్సికి సంబంధించిన సిసి టీవీ ఫుటేజ్ ను పరిశీలించగా ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆ ప్రాంతానికి వచ్చి తన కారు పక్కనే ఉన్న ఒక బండరాయితో టీఎస్ 28 కే 3158 కారు వెనక అద్దం పగలగొట్టి తన వెంట తీసుకువచ్చిన ఏదో ఆయిల్ ను కారుపై చల్లి కారును తగలపెట్టినట్టు గుర్తించడమైనది. తన కారు పక్కనే పార్కింగ్ చేసిన వీరు అనే అతని టీఎస్ 04 ఈకే 3731 కారు సైతం పూర్తిగా మంటలకు దగ్ధమైంది.
గతంలో సింగరేణి యాజ మాన్యంపై wp నెంబర్ 34 780/2024 కేసు వేయడంతో తనపై కక్ష పెంచుకున్న సింగరేణి యాజమాన్యం ఈ ఘాతుకాన్ని చేయించిందని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి విచారణ చేసి తనకు న్యాయం చేయాలని కోరారు. పోలీసులు ఈ ఘటనకు పాల్పడింది అక తాయులా ప్రత్యర్థులా అనే కోణంలో విచారణ ప్రారంభించారు.