calender_icon.png 24 September, 2024 | 4:53 AM

హక్కులు కాలరాశారు

24-09-2024 02:29:19 AM

పోలీసులు ప్రవర్తించిన తీరు అమానుషం

కింద పడేసి దారుణంగా ప్రవర్తించారు

ఆనాటి పరిణామాలపై కాదంబరి జెత్వాని ఆవేదన

ముంబై, సెప్టెంబర్ 23: బాలీవుడ్ నటి కాదంబరి జెత్వాని.. ఇప్పుడు తెలుగు రాష్ట్రా ల వారికి ఈ పేరు గురించి, ఈ వ్యక్తి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కొద్ది రోజులుగా మీడియాలో హోరెత్తిపోతున్న కాదంబ రి తన కేసు విషయమై.. ఆనాడు పోలీసులు తన విషయంలో ఎలా ప్రవర్తించారనే దాని పై మనసు విప్పి మాట్లాడారు. ఆనాటి ఘటనలో పోలీసులు తన హక్కులను కాలరాశా రని ఆవేదన వ్యక్తం చేసింది.

అంతే కాకుండా తనను లాగి పడేసి.. అపహరించారని వాపోయింది. ఈ కేసులో చర్యలు చేపట్టిన ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు సీనియర్ పోలీసు ఆఫీసర్లను సస్పెండ్ చేసింది. అంతే కాకుండా కాదంబరికి న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామ ని, దర్యాప్తు కొనసాగుతోందని కూడా ప్రకటించింది.

రాజకీయ ఆరోపణలు

కాదంబరి జెత్వాని కేసు ప్రస్తుతం రాజకీ య రంగు పులుముకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఈ కేసును రాజకీయంగా వాడుకుంటోందని పలువురు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా పోలీసులను కూడా ఇందులో పావులుగా మారు స్తున్నారని అంటున్నారు. 

అందుకోసమే ఈ అరెస్టు

తనను ఎందుకు అరెస్టు చేశారో కాదంబరి వివరించింది. ‘ముంబైలో ఒక వ్యాపారవేత్త మీద నేను రేప్ కేసు పెట్టా ను. ఆ కేస్ విచారణ తుది దశలో ఉన్న సమయంలో నన్ను ఆంధ్ర పోలీసులు అరెస్టు చేసి తీసుకొచ్చారు. ఆ కేసును నీరుగార్చడం కోసమే ఈ అరెస్టు నాటకం. ఆంధ్ర  పోలీసులు అరెస్టు చేయడం వల్ల తాను రేప్ కేసు విషయంలో కోర్టుకు హాజరుకాలేకపోయాను. ఈ విషయంలో పెద్ద వాళ్ల ప్రమేయం, డబ్బు ప్రమేయం ఉంది. ముంబైలో ఉన్న చాలా మంది తమ పలుకుబడిని ఉపయోగించి అణచివేసేందుకు కుట్ర పన్నారు. వారు నా ఆత్మస్థుర్యైన్ని దెబ్బతీయాలని చూశారు. ప్రస్తుత ప్రభుత్వం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రభుత్వం ఈ కేసును సరైన మార్గంలో పరిష్కరిస్తుందని భావిస్తున్నా. నాకు తిరిగి స్వాతంత్య్రం కావా లి’ అని అన్నారు.