calender_icon.png 11 January, 2025 | 2:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స.హ. చట్టం.. వాళ్లకు వరం?

01-12-2024 12:50:54 AM

  1. పెట్రేగిపోతున్న సామాజిక కార్యకర్తలు
  2. అధికారులకు బెదిరింపుల పర్వం
  3. రైతులను, చిరువ్యాపారులనూ వదలని వైనం

కరీంనగర్ సిటీ, నవంబరు 30: సమాచార హక్కు చట్టం ప్రాథమిక లక్ష్యం పౌరులకు సాధికారత కల్పించడం, ప్రభుత్వ పనిలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం, అవినీతిని అరికట్టడం, ప్రభుత్వ కార్యకలాపాల గురించి పౌరులకు తెలియజేయడం.

ఈ చట్టాన్ని కొందరు సామాజిక  కార్యకర్తలు కాసుల కోసం ఉపయోగించుకుంటుండంతో ఈ చట్టం లక్ష్యం పక్కదారి పడుతోంది. సామాజిక కార్యకర్తల పేరుతో కొందరు సమాచార హక్కు చట్టాన్ని వ్యాపార వస్తువుగా మారుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వ కార్యాలయాలు, సమాచార హక్కు చట్టం పరిధిలోకి వచ్చే సంస్థలకు సమాచారం కోసం దరఖాస్తులు చేయడం, సమాచారాన్ని సేకరించడం, దాని ఆధారంగా అధికారులు, వ్యాపార, వాణిజ్య, రైతులను, ప్రముఖులను బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తున్నది.

సులువుగా డబ్బు సంపాదనకు అలవాటుపడ్డ కొందరు సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం పొంది, దానిని పత్రికలు, సామాజిక మాధ్యమాలలో బహిర్గతం చేస్తామని బెదిరింపుల కు దిగుతూ, సంబంధిత వ్యక్తుల నుంచి డబ్బులు దండుకుంటున్నారని తెలుస్తున్నది.

వ్యాపారులు, రైతులు, కార్మిక సంఘాల నాయకులు, వాణిజ్య రంగాల్లో ఉన్నవారు సమాచార హక్కు చట్టం బాధితుల జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్నారని తెలు స్తుంది. వ్యాపారాలు, వాటి నిబంధనలు, అందులో సహజంగా ఉండే లోటుపాట్లు కొందరు సామాజిక కార్యకర్తలకు కాయ, కష్టం చేయకుండానే కాసులు సంపాదించి పెట్టే మార్గంగా మారిపోయాయి. 

మాజీ ప్రజా ప్రతినిధుల సహకారం..

గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి మొదలు వివిధ ప్రభుత్వ శాఖల్లోని జిల్లాస్థాయి ఉన్నతాధికారుల వరకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ తంతు కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి, చేగుర్తి, దుర్శేడ్, ఇరుకుల్ల, ఎలబోతారం, నగునూరు గ్రామాల్లో సామాజిక సేవ పేరుతో కార్యకర్తలు కొంద రు మాజీ ప్రతినిధుల సహకారంతో రైతులు, చిరు వ్యాపారాలు చేసుకునే వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారని బాధితులు వాపో తున్నారు.

సామాజిక కార్యకర్తల పేరుతో స.హ. చట్టం కింద దరఖాస్తు చేసింది మొద లు బాధిత వ్యక్తులతో సంప్రదింపులు మొదలుపెట్టేవారు కొందరైతే, సమాచారం సేకరిం చిన తర్వాత దానికి వెలకట్టి బేరం ఆడుతున్నట్లు బాధితులు చెపుతున్నారు.

చాలా ఇబ్బందులు పెడుతున్నారు

గ్రామంలో చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. గత రెండేళ్లుగా సామాజిక కార్యకర్తలు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. విధిలేక బయటకు వచ్చా.

 గాండ్ల గోపాల్, ఎలబోతారం

ఉద్యోగానికి రాజీనామా చేశా

గ్రామ కార్యదర్శిగా గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో అభివృద్ధి చేశాం. అభివృద్ధి జరుగుతున్న సమయంలో గ్రామానికి, పంచాయతీకి అవసరం లేని దరఖాస్తును చూపుతూ ఓ సామాజిక కార్యకర్త చాలా ఇబ్బంది పెట్టా డు. దీంతో కార్యదర్శి పదవికి రాజీనామా చేశాను.

 స్వాతి, మాజీ కార్యదర్శి, ఎలబోతారం