పాక్, సౌతాఫ్రికా రెండో టెస్టు
కేప్‌టౌన్: సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 615 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ రికెల్‌టన్ (343 బంతుల్లో 259; 29 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. బవుమా (106)తో పాటు వికెట్ కీపర్ పాల్ వెరిన్నే (147 బంతుల్లో 100) సెంచరీతో మెరిశాడు.
ఆఖర్లో మార్కో జాన్సెన్ (62), కేశవ్ మహరాజ్ (40) వేగంగా ఆడి భారీ స్కోరుకు బాటలు వేశారు. పాక్ బౌలర్లలో సల్మాన్ అగా, మొహమ్మద్ అబ్బాస్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ 21 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. పాక్ బౌలర్ అబ్బాస్ టెస్టుల్లో వంద వికెట్ల మార్క్ అందుకోగా.. టెస్టుల్లో (615) సౌతాఫ్రికాకు ఒక ఇన్నింగ్స్‌లో ఇది ఆరో అత్యధిక స్కోరు కావడం విశేషం.