calender_icon.png 15 January, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ కేంద్రాల్లో వరి ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలి

05-11-2024 06:04:03 PM

దండేపల్లి (విజయక్రాంతి): ప్రభుత్వ కేంద్రాల్లో రైతులు వరి ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని డిఆర్డిఓ కిషన్ అన్నారు. మంగళవారం దండేపల్లి, నాగసముద్రం గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రల్లో రైతులు వరి ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని అన్నారు. నాణ్యత విషయంలో ప్రమాణాలు పరిశీలించిన తర్వాత కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఎంవేణుగోపాల్, ఎపిఎం భూపతి బ్రమయ్య, సురేందర్, లావణ్య, విజయ, బొమ్మన శ్యామల, సిరికొండ ఉమా, శ్రీలత, కమల, సునీత భూలక్ష్మి రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.