02-04-2025 12:00:00 AM
రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి
కామారెడ్డి, ఏప్రిల్01 (విజయక్రాంతి), పేదవారికి కడుపునిండా సన్నా బియ్యం భోజనం అందించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడలో 27వ రేషన్ దుకాణం కొల్లూరులో పదో నెంబర్ రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూపేదవారికి సన్న బియ్యంతో కడుపు నిండా భోజనం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. జిల్లాలో 2,53,303 మందికి సన్న బియ్యం పంపిణీ తో లబ్ది చేకూరనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్ మై స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
కామారెడ్డిలో....
కామారెడ్డి పట్టణంలోని భారత్ రోడ్ లో నీ రేషన్ దుకాణంలో సన్న బియ్యం పథకాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కా రంగుల శకుంతల అశోక్ రెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్ల రాజు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు.
దోమకొండలో....
దోమకొండ మండల కేంద్రంలో నీ 19వ రేషన్ దుకాణంలో సన్న బియ్యం పథకాన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అనంతరెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్ లో ప్రారంభించారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్ విండో అధ్యక్షులు నాగరాజు రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి రామస్వామి గౌడ్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం మధు శ్రీకాంత్ శంకర్ రెడ్డి నరసారెడ్డి యూత్ నాయకులు రమేష్ నల్ల శ్రీనివాస్ అజయ్ రాములు రాజు కోఆప్షన్ మాజీ సభ్యుడు తదితరులు పాల్గొన్నారు.
సదాశివ నగర్ లో....
సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి లో సన్న బియ్యం పథకాన్ని గాయత్రీ షుగర్స్ సీడీసీ చైర్మన్ మహమ్మద్ ఇర్షాద్ ఉద్దీన్, విండో చైర్మన్ సదాశివరెడ్డి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు కాలమల్ల అశోక్ విండో మాజీ వైస్ చైర్మన్ సంకరి రాజలింగం మండల మైనార్టీ అధ్యక్షుడు సాధిక్‌అలీ, మహిళా కమిటీ మండల అధ్యక్షురాలు ఆస కవిత, సీనియర్ నాయకులు ఆకుల సిద్ధిరాములు, ఆకుల గంగరాజు, రేషన్ డీలర్ ఆకుల ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు ధర్మాజీ రాజయ్య, మాధురి శ్రీనివాస్, చెరుకు ప్రసాద్, బొలిపెల్లి రాము, రాజమణి, ఉమా రాణి తదితరులు పాల్గొన్నారు.
మద్నూర్ లో....
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్ ఆధ్వర్యంలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు విండో చైర్మన్ శ్రీనివాస పటేల్, మారుతి హనుమాన్ మందిర్ చైర్మన్ రామ్ పటేల్, యువజన నాయకుడు హనుమంతు యాదవ్, నాయకులు హనుమంతురావు దేశాయ్, మాజీ ఎంపిటిసి శంకర్ పటేల్, వెంకట్ పటేల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
బిచ్కుంద లో....
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున అప్ప సెట్ కార్ సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ధర్పల్లి గంగాధర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్, తుకారాం, మైనార్టీ నాయకులు యోగేష్, పోతుల లింగం, ఉత్తం నాయక్, గంగారం తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిలో....
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణం లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ గౌడ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కురుమ సాయిబాబా ఆధ్వర్యంలో సన్న బియ్యం పథకాన్ని రేషన్ దుకాణంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విండో వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ మాజీ వైస్ ఎంపీపీ నును గొండ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి సామిల్ విద్యాసాగర్ సుజిత్ శంకర్ షేఖవత్ అలీ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గాంధారిలో....సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చిత్రపటాలకు కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తూర్పు రాజులు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజలకు సన్న బియ్యం అన్నం తినేలా చూడడం అభినందనీయమన్నారు.