calender_icon.png 8 January, 2025 | 2:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊపందుకున్న వరి నాట్లు

04-01-2025 12:17:13 AM

  1. జిల్లాలో రోజు వేల ఎకరాల్లో సాగు
  2. బీహార్, యూపీ, ఒడిస్సా రాష్ట్రాల కూలీలతో పనులు
  3. జిల్లాలో వరి సాగు 1.74 లక్షల ఎకరాల అంచనా

సిరిసిల్ల, జనవరి 3 (విజయక్రాంతి): యా సంగి సీజన్లో వరి నాట్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే వరి పంట సాగు చేసేందుకు పొలాలను సిద్ధం చేసుకున్న రైతులు, వరి నాట్లు వేస్తూ బిజిబిజీగా ఉన్నారు. ఈ యాసంగిలో వరి పంట సాగు 1.74 ఎకరా ల్లో చేస్తారనే అంచనా వ్యవసాయాధికారు లు వేశారు.

భూగర్భ జలాలు ఆశించనం తగా ఉండడంతో రైతులు వరి పైపు ఎక్కువ గా మొగ్గు చూపుతున్నారు. ఆరుతడిపంటలు సాగు చేసే రైతులు సైతం ఈ పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు. డిసెంబర్ మొదటి వారంలో నారు మల్లు సిద్ధం చేసి, పొలాలు దున్నారు. స్థానికంగా కూలీల కొరత ఉండ డంతో సమయానికి రాకపోవడంతో ఇతర రాష్ట్రాల కూలీలపై రైతులు ఆధారపడ్డారు.

దీంతో వారితోనే ఎక్కువగా వరి నాట్లు వే యిస్తున్నారు. వీరు నాట్లు వేస్తే కూలీ తక్కువ తో పాటు సమయం వృథా కాకుండా, తక్కువ సమయంలో వరి నాట్లు వేస్తున్నా రు. బీహార్, యూపీ, ఒడిస్సా రాష్ట్రాల కూలీ లతోనే నిత్యం వేల ఎకరాల్లో వరి నాట్లు వేయిస్తున్నారు. ఎకరాకు రూ. 3 వేల నుంచి రూ.4 వేల వరకు కూలీలకు చెల్లించా ల్సి వస్తుంది.

ఇప్పటికే వరి మద్ధతు ధర ప్రభు త్వం చెల్లించడంతో పాటు చివరి వరకు గింజ కొనడంతో డిసెంబర్ మొదటి వారం నుంచే వరి నాట్లు ప్రారంభించారు. ముందు గానే వరి నాట్లు వేస్తే పంట ముందుగానే చేతికి వస్తుందనే రైతులు వరి నాట్లు వేయడం ముమ్మరం చేశారు. జిల్లాలోని మిడ్ మానేరు, అన్నపూర్ణ ప్రాజెక్ట్, ఎగువ మానేరులలో నీరు పుష్కలంగా ఉండడంతో ఈ ప్రాంతాల్లో వరి నాట్లు జోరందుకు న్నాయి.

మిగితా ప్రాంతాల్లో బోరు బావుల పై ఆధారపడి నాట్లు వేస్తున్నారు. ఇప్పటికే యాసంగిలో రైతులు కావాల్సిన ఎరువు లను, విత్తనాల కొరత లేకుండా వ్యవసాయ శాఖ అందుబాటులో ఉంచింది. ఇప్పటికే సగానికి పైగా వరినాట్లు వేయగా, మిగిలిన వరి నాట్లు నెలఖారు వరకు పూర్తి చేసేలా రైతులు పనుల్లో నిమగ్నమైయ్యారు.

అదేవి ధంగా రాష్ర్ట ప్రభుత్వం సన్నాలకు బోనస్ రూ.500లు ప్రకటించడంతో ఈ యాసం గిలో సన్నాల సాగు ఎక్కువగా ఉంటందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవి ధంగా ఆరుకండి పంటలు దాదాపు 3 వేల ఎకరాల్లో సాగు చేసేందుకు సిద్ధమవుతు న్నారు. ఒకేసారి యాసంగిలో వరి నాట్లు ఊపందుకోవడంతో కూలీల కొరత, ట్రాక్టర్ల కిరాయిల అధికం కావడంతో రైతులపై అదనంగా భారం పడుతోంది.