30-04-2025 06:33:45 PM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్...
లక్షెట్టిపేట (విజయక్రాంతి): వరి ధాన్యంకు కేటాయించబడిన రైస్ మిల్లుల యజమాన్యాలు త్వరితగతిన అన్లోడింగ్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. బుధవారం మండలంలో యాసంగికి సంబంధించిన వరి ధాన్యం కేటాయించబడిన రైస్ మిల్లులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్(Additional Collector Sabavat Motilal) తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ... ప్రభుత్వం ద్వారా నిబంధనల మేరకు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి ట్యాగింగ్ చేయబడిన రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందన్నారు.
ట్యాగింగ్ చేయబడిన రైస్ మిల్లుల యాజమాన్యాలు ఆలస్యం చేయకుండా ఎక్కువ మంది హమాలీలను నియమించుకొని త్వరితగతిన కేటాయించబడిన ధాన్యాన్ని అన్లోడింగ్ చేసుకోవాలని తెలిపారు. రైతులు కల్లాలలో ధాన్యాన్ని ఆరబెట్టి తప్ప, తాలు, మట్టి గడ్డలు లేకుండా నిబంధన ప్రకారం పరిశీలించుకుని నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన వారికి, సిఎంఆర్ డెలివరీ సకాలంలో చేసిన రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయించడం జరుగుతుందని తెలిపారు. గన్నీ సంచుల నిర్వహణ పక్కదారి పట్టకుండా జాగ్రత్త వ్యవహరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట తహసీల్దార్ దిలీప్ కుమార్, రైస్ మిల్లుల యాజమాన్యాలు, సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.