calender_icon.png 13 January, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు పూర్తిచేయాలి

05-01-2025 12:00:00 AM

అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

వనపర్తి, జనవరి 4 (విజయక్రాంతి) : 2023-  ౨౦24 రబీ, 2024-25 ఖరీఫ్ సీజన్లకు సంబంధించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఇవ్వాల్సిన సీఎంఆర్ ధాన్యాన్ని రైస్ మిల్లర్లు వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జీ వెంకటేశ్వర్లు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో  సీఎంఆర్ ధాన్యం విషయంపై  రైస్ మిల్లర్ల తో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. 

అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 2023-24 రబీ సీజన్ కు సంబంధించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఇవ్వాల్సిన సీఎంఆర్ ధాన్యాన్ని  జనవరి 25 లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. అదేవిధంగా  2024-25 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి సివిల్ సప్లు కార్పొరేషన్ కు ఇవ్వాల్సిన సీఎంఆర్ ధాన్యాన్ని కూడా రైస్ మిల్లర్లు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

నిర్దేశిత గడువులోపు మిల్లర్లు  ధాన్యాన్ని అప్పగించకపోతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మిల్లర్లు నిర్లక్ష్య ధోరణి వీడి సీఎంఆర్ ధాన్యాన్ని అప్పగించి చట్టపరమైన చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.

ఇంకా చాలామంది మిల్లర్లు ఎంత చెప్పినా బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం లేదని, అదే ధోరణి కొనసాగితే ధాన్యాన్ని ఇతరులకు షిఫ్టింగ్ చేయడానికి వెనుకాడబోమని తెలిపారు. సమావేశంలో సివిల్ సప్లు అధికారి కాశీ విశ్వనాథ్, సివిల్ సప్లు డిఎం రమేష్, రైస్ మిల్లర్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.