జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్..
కామారెడ్డి (విజయక్రాంతి): సీఎంఆర్ కోసం రైస్‌మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటి అగ్రిమెంట్‌లు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ హల్‌లో జిల్లాలోని రైస్‌మిల్లుల యాజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం సీఎంఆర్‌కోసం మిల్లుల యాజమానులు బ్యాంక్ గ్యారెంటి, అగ్రిమెంట్లు వెంటనే సమర్పించాలని తెలిపారు. ఈ సంవత్సరం ధాన్యం కేటాయింపులు జరుగుతున్న దృశ్య మిల్లర్లు గ్యారెంటీలను, అగ్రిమెంట్లను అందజేయాలని తెలిపారు. గత 2021 2022 సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ రైస్‌ను వెంటనే సరఫరా చేయాలని లేకుంటే డిపాల్ట్ అయిన మిల్లులపై చర్యలు తీసుకోవడం జరగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, పౌరసరఫరాల కార్పోరేషన్ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌరసరపరాల అధికారి నర్సింహరావు, రైస్‌మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేందర్ ప్రసాద్, భూమేశ్, లింగం, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.