calender_icon.png 31 October, 2024 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైస్ మిల్లర్స్ సంఘంలో ముసలం

30-10-2024 01:29:25 AM

  1. జిల్లా అధ్యక్షుడే టార్గెట్‌గా కార్యవర్గ సమావేశం
  2. నిధుల గోల్‌మాల్‌పై నిలదీసిన  సభ్యులు

కరీంనగర్, అక్టోబర్ 29 (విజయక్రాంతి):  కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేష న్‌లో ముసలం పుట్టింది. సంఘం జిల్లా అధ్యక్షుడు బోయినపల్లి నర్సింగరావు నిధు లు గోల్‌మాల్ చేసిన విషయమై కార్యవర్గ సభ్యులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తున్నది.

సోమవారం రాత్రి కరీంనగర్‌లో జరిగిన సంఘం సంఘం కార్యవర్గ సమావే శంలో సమావేశంలో సభ్యులు అధ్యక్షుడిని టార్గెట్ చేస్తూ విరుచుకుపడినట్లు సమాచా రం. సంఘం పరిధిలో ఓ పద్దుకు అందిం చిన రూ.40 లక్షలు, తీగల వంతెన కోసం కేటాయించిన రూ.10 లక్షలతో పాటు మరో రూ.13 లక్షలు కలుపుకొని..

మొత్తం రూ.63 లక్షల లెక్కలు తేల్చాలని కార్యవర్గ సభ్యులు అధ్యక్షుడిని నిలదీశారని సమాచారం. అధ్య క్షుడు నిధులకు సంబంధించిన లెక్కలు చూపించే ప్రయత్నం చేసినప్పటికీ సభ్యులు శాంతించకపోగా, సమావేశం నుంచి వాకౌ ట్ చేశారని తెలిసింది.

నిధుల గోల్‌మాల్ పై ఇప్పటికే సభ్యులు హైదరాబా ద్‌లో మంత్రి పొన్నం దృష్టికి తీసుకెళ్లారని, సుమారు రూ.2 కోట్ల మేర అక్రమాలు చోటు చేసుకున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మరోవైపు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైనందున, విభేధాలను పక్కన పెట్టి ముందు ఆ ప్రక్రి య పూర్తి చేయాలని మంత్రి సూచించినట్లు తెలిసింది.

రేషన్ షాపులకు సన్నబియ్యంపై మిల్లర్ల కినుకు..

రేషన్ దుకాణాల పరిధిలో జనవరి నుంచి లబ్ధిదారులకు సన్నబియ్యం ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు మిల్లర్లు మాత్రం తమ డిమాండ్లను ఇప్పటికే సర్కార్ ముందు ఉంచి, వాటిని పరిష్కరించాలని కోరుతోంది. ధాన్యాన్ని మరపట్టించేటప్పుడు సన్నబి య్యం 67 శాతం ఉండాలని, ధాన్యం దించేందుకు బ్యాంకు గ్యారెంటీ, సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వాలని అగ్రిమెంట్ చేయాలని ప్రభుత్వం మిల్లర్లకు ఆదేశాలిచ్చింది.

రూ. 20 లక్షల సొమ్ము డిపాజిట్ చేసి ధాన్యం తీసుకుంటే వచ్చే తమకు వచ్చే లాభం ఏం లేదని మిల్లర్లు పదవి విరుస్తున్నారు. వంద ల లారీల ధాన్యాన్ని మిల్లింగ్ చేసినా తమ కు రూ.20 లక్షలు రావని కినుక వహించినట్లు తెలుస్తున్నది. ఈ విషయంలో మిల్ల ర్లెవరూ తొందరపడొద్దని ఇప్పటికే రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి తొడుపునూరి కరుణాకర్ ఇప్పటికే పిలుపునిచ్చారు.

ఒకవేళ అధికారులు మిల్లర్లను వేధించి బలవంతంగా కేసులు పెడతామని బెదిరిస్తే తాము భయపడొద్దని మిల్లర్లకు సూచించినట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి విద్యుత్ చార్జీలు సైతం పెరగనుండడంతో తమపై మరింత భారం పడుతుం దని మిల్లర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ధాన్యం మిల్లింగ్, రేషన్ బియ్యం సమస్యలు ఏ కొలిక్కి వస్తా యో వేచి చూడాల్సిందే మరి.