calender_icon.png 25 October, 2024 | 1:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైస్ మిల్లు యజమాని అరెస్ట్

25-10-2024 11:43:09 AM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని మాతేశ్వరి అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్ యజమాని దర్శనాల రమేష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్ తెలిపారు. ప్రభుత్వం 2023-2024 ఖరీఫ్ సీజన్ కు రైతుల నుండి ధాన్యాన్ని పిడి, డిఆర్డిఏ, డి సి ఓ, డీసీఎంఎస్ అనే సంస్థల ద్వారా సేకరించి అగ్రిమెంట్ ప్రకారం 38 50.200 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అతనికి అప్పగించడం జరిగిందని తెలిపారు.

దీనిలో నుండి పౌరసరఫరాల శాఖ కు 67% కస్టమర్ మిల్లింగ్ రైస్ ఇవ్వాల్సి ఉండగా 346.797 మెట్రిక్ టన్నుల సి ఎం ఆర్ ధాన్యాన్ని అప్పగించాడు. మిగతా 2232.593 ధాన్యాన్ని ప్రభుత్వాన్ని మోసం చేసి మార్కెట్లో అమ్ముకున్నాడని తెలిపారు. ఈ ధాన్యం విలువ రూ 6,53,57,646 ఉంటుందని ఎసిపి తెలిపారు. దీనిపై జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ శ్రీకళ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడు దర్శనల రమేష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు ఏసిపి రవికుమార్ తెలిపారు.