calender_icon.png 21 November, 2024 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి కొనుగోలు కేంద్రంలో మాయమైన వడ్లలారీ.!

21-11-2024 12:26:20 PM

రైతుల నుంచి కొనుగోలు చేసిన ఐకెపి. 

ఆన్లైన్ ద్వారా ఎంపిక చేసిన రైస్ మిల్ తరలింపునకు ట్రక్ షీట్ విడుదల.

లారీ ఓనర్స్ తో కుమ్మక్కై వడ్ల లారీని ఇతర మిల్లుకు మళ్లించిన కాంగ్రెస్ నేతలు.

గందరగోళంలో రైతులు. 

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): రైతుల నుంది ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్ల లారీ మాయమైంది. ఆన్లైన్ ద్వారా ఎంపిక చేసిన రైస్ మిల్లు వద్దకు కాకుండా దొంగచాటుగా బ్లాక్ లిస్టులో ఉన్న రైస్ మిలుకు తరలించినట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యేక్షణ లేకపోవడంతో కింది స్థాయిలో లారీ ఆనర్స్, డ్రైవర్స్ తో కుమ్మక్కై ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్ల లారీని ఎసికె లు పెండింగ్ ఉన్న మిల్లులకు తరలించి ఇటు ప్రభుత్వాన్ని, అటు రైతులను బురిడీ కొట్టిస్తున్నారని మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే... నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వట్టెమ్ వరి కొనుగోలు సెంటర్లో  స్థానిక రైతులు వరి ధాన్యం తీసుకొచ్చారు.

అక్కడి ఐకెపి ఉద్యోగులు 5మందికి చెందిన 800 బస్తాలు 320 క్వింటాళ్ల వరి ధాన్యం బస్తాలను ఆన్లైన్ ద్వారా గుడిపల్లిలోని సీతా రామాంజనేయ రైస్ మిల్లుకు ఎంపిక చేసి ట్రక్ షీట్  ఎపి 04 టివి 0985 నంబరు గల వాహన డ్రైవర్ రాజుకు అప్పగించారు. అక్కడినుండి కదిలిన వడ్ల లారీని బిజినపల్లికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ లీడర్లు వాహన డ్రైవర్, వాహన యజమానితో కుమ్మక్కైరాత్రికి రాత్రే వట్టేమ్ ప్రాంతంలోని ఓ రైస్ మిల్లుకు అక్రమంగా తరలించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాగా కొనుగోలు కేంద్రం నుండి బయటపడ్డ వడ్ల లారీ ఎంతకూ చెరకపోవడంతో అధికారులు అనుమానంతో విచారించగా దొంగతనానికి పాల్పడినట్లు గురువారం గుర్తించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం.