13-03-2025 01:44:37 AM
కోనరావుపేట, మార్చి 12: యాసంగి ప్రారంభం నుండి రైతులను కష్టాలు వెంటా డుతున్నాయి. పంటల సాగుకు ప్రకృతి సహకరించకపోవడం తో పాటు, ప్రభుత్వం నుండి వచ్చే పంట సాయం కూడా అందక పోవడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. అప్పులు తెచ్చి పంటలు సాగు చేస్తే, సాగునీరందక పూర్తిగా పంటలు ఎండిపో వడంతో మేతగా మారాయి. మెట్ట ప్రాంత మైన కోనరావుపేట మండలంలో ప్రధాన పంట సాగు వారి కావడంతో, ఎక్కువగా సాగు చేసేందుకు ఆసక్తి చూపారు.
ముఖ్య జలవనురులైన మల్కపేట ప్రాజెక్టుతో పాటు నిమ్మ పెళ్లి మూల వాగు ప్రాజెక్టు లపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. రిజర్వాయర్ నిర్మాణం పూర్తయినప్పటికీ ఆశించిన స్థాయిలో నీటి నిలువలు లేకపోవ డంతో పూర్తిగా భూగర్భ జలాలు అడుగంటి పోయి, బోరు బావులు, బోరు మంటు న్నాయి. వాటిపై ఆధారపడి సాగు చేయగా, వాటికి సరిపడా నీరు అందకపోవడంతో మొలకెత్తి దశలోనే ఎండిపోయే పరిస్థితి దాపురించింది.
వరి పంట పొలాలను పశువులకు,మేకలకు మేతగా రైతులు వదిలిపెట్టారు. గంపెడాశతో వరి పంటలు సాగు చేస్తే, సాగునీరు లేక ఎండిపోవడంతో, పెట్టుబడులు మీద పడే పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిడ్ మానేరు లో ఆశించినంతగా నీటి నిల్వలు ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంతో పూర్తిస్థాయిలో మలకపేట రిజర్వాయర్ను నింపడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టులో నీటి నిలువలు ఉంటే బోరు బావులలో పెరిగి, వరి పంట పొలాలకు సాగినీరు అందుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు లేక నిజామాబాద్ మల్కపేట, కనగర్తి, వెంకట్రావుపేట గ్రామాల్లో వరి పంట పొలాలు పూర్తిస్థాయిగా ఎండిపోయాయి. నిజామాబాదులో వరి పంటను కాపాడుకునేందుకు రైతులు వాటర్ ట్యాంకులతో నీటిని అందిస్తున్నారు.