26-03-2025 02:05:20 AM
సూర్యాపేట,మార్చి25(విజయక్రాంతి):తెలుగు సంవత్సరాది పండుగైన ఉగాది నుంచి పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉగాది రోజున సూర్యాపేట జిల్లా మట్టపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించనున్నారు. దీంతో అధికారులు సన్నబియ్యం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఆదివారం నుంచే మండల లెవల్ స్టాక్ పాయింట్ల (ఎంఎల్‌ఎస్) నుంచి దుకాణాలకు బియ్యం రవాణా ప్రారంభించారు.
ప్రతి యూనిట్ కు 6 కిలోలు..
ఏప్రిల్ 1నుంచి ప్రతి యూనిట్కు 6 కిలోల చొప్పున పేదలకు రేషన్ దుకా ణాల్లో సన్న బియ్యం పంపిణీకి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం జిల్లాలో 3,24,991 రేషన్ కార్డులు ఉండగా, 9,26,681 యూనిట్లుగా నమోదయ్యారు. వీరికి ప్రతినెలా 5.56 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంది. వీటీతోపాటు కొత్త రేషన్ కార్డుదారు లకు కూడా కోటా ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగా ప్రస్తుతం గోదాంల నుంచి 75 శాతం బియ్యం రేషన్ దుకాణాలకు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.. రేషన్ కార్డుల లెక్క తేలిన తర్వాత వచ్చే యూనిట్ల సంఖ్య ఆధారంగా మిగతా 25 శాతం బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు అధికారలు చెబుతున్నారు. కొత్త రేషన్ కార్డుదారులకు కూడా బియ్యం పంపిణీ చేయనున్న నేపథ్యంలో కోటా పెరగనున్నట్టు తెలుస్తోంది.
ప్రారంభం జిల్లా నుంచే...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణి పధకం సూర్యాపేట జిల్లా నుంచి సీఎం రేవంత్రెడ్డి ప్రారంబించను న్నారు. ఇందుకు రాష్ట్ర ఫౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజుర్ నగర్ నియోకవర్గంలో మఠంపల్లి మండలం మట్టపల్లి దేవాలయం వేదిక కానున్నది. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం, రాజేశ్వర్, డిఎస్వో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి సన్న బియ్యం పంపిణీకి ఏర్పాటు చేస్తున్నాం . గోదాముల నుంచి రేషన్ షాపులకు బియ్యం సరపరా ప్రారంభించాం. ప్రస్తుతం ఉన్న కార్డు లతోపాటు, నూతనంగా ఇచ్చే కార్డులకు కూడా బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేశాం.