03-04-2025 01:10:35 AM
మెదక్, ఏప్రిల్ 2(విజయక్రాంతి):రేషన్ కార్డున్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందజేయడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం అని మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని పోస్టాపీస్ సమీపంలోని రేషన్ దుకాణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఉగాది కానుకగా సన్నబియ్యం పథకాన్ని ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా జాయింట్ కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ రమాదేవి, మెదక్ ఎమ్మార్వో లక్ష్మణ్ బాబు, ఆర్.ఐ. లక్ష్మణ్ లు పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదోళ్ళు సన్నబియ్యం తినాలనే ముఖ్య లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వంది అని ఆయ గుర్తుచేశారు. అంతే కాకుండా పేదలకు రేషన్ కార్డులపై దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇస్తామని అన్ని ప్రధాన పార్టీలు ఎన్నో ఏళ్లుగా చెబుతూనే వచ్చాయని ఆయన అన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఇది కూడా ఒకటి అని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఖరీఫ్ సీజన్లో రైతుల నుండి క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చి 24 లక్షల టన్నుల సన్న వడ్లను కొనుగోలు చేసిందని ఆయన గుర్తుచేశారు. వాటిని మిల్లింగ్ చేయించి, వచ్చిన బియ్యాన్ని రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
అంతే కాకుండా సంవత్సర కాలంలోనే మెదక్ నియోజక వర్గంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ పవన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు గౌడ్, తాజా మాజీ మున్సిపల్ చైర్మెన్ తొడుపునూరి చంద్రపాల్, తాజా మాజీ కౌన్సిలర్ లు దాయర రాజలింగం, లక్ష్మినారాయణ గౌడ్,
రాగి అశోక్, దొంతి లక్ష్మి ముత్యం గౌడ్, గోదల సాయి, దుర్గప్రసాద్, సమీ, బొద్దుల క్రిష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు లల్లూ, గూడూరి శంకర్, దేవులా, గాడి రమేశ్, నాగరాజు, బట్టి సాయి, అశోక్, ఎం.డి. సూపి, ముజాంబిల్, మైసన్, అబ్బు, సాదిక్, కొండ శ్రీను, ప్రవీణ్, సుభాష్ చంద్రబోస్, చింతల శ్రీనివాస్, శివరామక్రిష్ణ, గంట రాజు లతో పాటు తదితరులు పాల్గోన్నారు.