01-04-2025 04:40:21 PM
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..
చిట్యాల (విజయక్రాంతి): ప్రతి పేదవారి ఇంటికి సన్నబియ్యం చేరాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం చిట్యాల మండల కేంద్రంలోని వెంకట్రావుపల్లి (సీ)లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నం బియ్యం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పార్టీ శ్రేణులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి పేదవారి ఇంటికి సన్నబియ్యం అందాలని, పేదవారికి పట్టెడన్నం పెట్టాలన్న గొప్ప ఆలోచనతో సన్న బియ్యం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని అన్నారు. రాష్ట్రంలోని 3 కోట్ల 10 లక్షల మందికి ఆరు కిలోల సన్నబియ్యం అందజేస్తూ అందుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయినా ప్రభుత్వం భరిస్తుంది అన్నారు.
ఏ ప్రభుత్వాలున్నా ఈ సన్న బియ్యం పథకాన్ని రద్దు చేయలేరని, ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకం అన్నారు. రైతులు పండించిన ప్రతి చివరి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, సన్నవడ్లు పండిస్తే 500 బోనస్ ఇస్తామని, రైతులను ప్రోత్సాహకాలు అందిస్తున్న గొప్ప ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల తహసీల్దార్ హేమ, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖిరాల మధువంశీ కృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య, టౌన్ అధ్యక్షుడు బుర్ర లక్ష్మణ్ గౌడ్, బుర్ర శ్రీనివాస్, చిలుకల రాయకొమురు, మాజీ ఎంపీటీసీ దబ్బేట అనిల్, యూత్ అధ్యక్షుడు అల్లకొండ కుమార్, గంగాధరి రవీందర్, చిలుముల రాజమౌళి, తదితరులు పాల్గొన్నారు.