calender_icon.png 3 April, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలందరికీ సన్న బియ్యం

01-04-2025 06:48:19 PM

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి

పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): తెలంగాణాలో పేదలందరికీ ఇక సన్న బియ్యం పంపిణీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ పెద్ద కొడప్గల్ మండల శాఖ అధ్యక్షులు మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం పెద్ద కొడప్ గల్ మండలం కేంద్రంలోని రేషన్ షాపు లో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిన్నటి వరకు రేషన్ షాప్ ల ద్వారా దొడ్డు బియ్యం అందించే వారని, ఈ బియ్యాన్ని అమ్మేసి చాలా మంది సన్న బియ్యం కొనే వారని తెలిపారు. ఇది గమనించిన మన సిఎం సన్న బియ్యం పథకం ప్రారంభించి పేదల కడుపు నింపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు షామప్ప పటేల్, చిప్ప మోహన్, అహ్మద్, డాక్టర్ సంజీవ్, బసవరాజ్ దేశాయ్, నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.