calender_icon.png 6 November, 2024 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి రైతులు అరిగోస

06-11-2024 02:16:09 AM

  1. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించని అధికారులు
  2. ఎండుకు ఎండుతూ.. వానకు తడుస్తున్న ధాన్యం రాశులు

అబ్దుల్లాపూర్‌మెట్, నవంబర్ 5: వరి రైతులు అరిగోస పడుతున్నారు. వరి కోతలు కోసి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదని వాపోతున్నారు. వడ్లు కల్లాల్లోనే ఉంటున్నాయని..

దీంతో ఎండకు ఎండి, వానకు తడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడితే ధాన్యం మొలకలు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం పంట పండించడం ఒకెత్తయితే.. అమ్ముకోవడం మరో ఎత్తు అవుతుందన్నారు.

వడ్లు రాశులు పోయడానికి పట్టాలు కిరాయి తీసుకుంటున్నామని, ఒక్కో పట్టాకు ప్రతిరోజు రూ.15 చెల్లించాల్సి వస్తోందని అంటున్నారు. అప్పులు చేసి పంటలు పండిస్తున్నామని.. మళ్లీ వరినాట్లు వేసే సమయం వస్తుందని.. కానీ కోసిన వడ్ల ఇక్కడే ఉంటే మళ్లీ పంట ఎలా వేయాలని ప్రశ్నిస్తున్నారు. 

నెల గడుస్తున్నా కల్లాల్లోనే

అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని గౌరెల్లి, బాచారం, బండరావి రాలలో రైతులు వరి మీదనే ఎక్కువగా ఆధారపడతారు. గౌరెల్లిలో వరి కోతలు కోసి దాదాపు 30 రోజులు అవుతుందని రైతులు తెలిపారు. కానీ కొనుగోలు కేం ద్రాలు ప్రారంభించలేదని వాపోతున్నారు. ధాన్యాన్ని తీసుకొచ్చి కల్లా ల్లో పోశామని.. అవి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయని గౌరెల్లి, బాచారం, బండరావిరాలకు చెందిన రైతులు చెబుతున్నారు. 

కల్లాలు ఉండే ఏరియా అంతా అట వీ ప్రాంతం కావడంతో రాత్రి సమయంలో పాములు, తేళ్ల బారిన పడుతున్నామని రైతులు తెలిపారు. అదేవిధంగా పందికొక్కులు ధాన్యాన్ని తింటున్నాయని చెబుతున్నారు. రైతుల గోస ఎవరూ పట్టించు కోవ డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.