calender_icon.png 2 April, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్న బియ్యం షురూ

01-04-2025 05:13:49 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని 19వ రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. దోమకొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అనంతరెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ ప్రారంభించారు. అనంతరం మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ మాట్లాడుతూ... దోమకొండ మండలంలో 19 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. దోమకొండలో 10, లింగుపల్లిలో 01, అంచనూరులో ఒకటి చింతామణి పల్లిలో ఒకటి, ముత్యంపేటలో రెండు, సంగమేశ్వరులు 2, అంబర్పేటలో రెండు, సీతారాంపూర్ లో ఒకటి, మొత్తము19 షాపుల లో కలిపి 8178 కార్డ్స్ ఉన్నాయి. వాటి ద్వారా 166.131 మెట్రిక్ క్వింటాల్స్, అనగా 1,66,131 కిలోల సన్న బియాన్ని మండలానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సరఫరా చేస్తున్నారు. 

గత ప్రభుత్వాలు దొడ్డు బియ్యాన్ని అందించగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మండలంలో తెల్ల కార్డులు కలిగిన మొత్తం కుటుంబాలకు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ దే అని మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి షబ్బీర్ అలీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దోమకొండ గ్రామ  కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం మధు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్ , ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు నాగరాజు రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, రామస్వామి గౌడ్, అబ్రబోయిన స్వామి, శ్రీకాంత్, శంకర్ రెడ్డి, నర్సారెడ్డి, పట్టణ యూత్ అధ్యక్షుడు రమేష్, మాజీ మాజీ ఎంపీటీసీ నల్ల శ్రీనివాస్, అజయ్ కో ఆప్షన్ సభ్యుడు ఎండి షమ్మీ, రాములు, రాజు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.