01-04-2025 07:29:08 PM
మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు, ఉద్యమకారుడు రాయపూడి వెంకటనారాయణ..
కోదాడ: భారతదేశ చరిత్రలోనే పేదవాళ్లకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం నిజంగా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు రాయపూడి వెంకటనారాయణ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కోదాడ పట్టణంలోని 31వ వార్డులో సన్నబియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మఠంపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమక్షంలో కార్యక్రమం ప్రారంభించడం నిజంగా అభినందనీయమన్నారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చిత్రపటాలకు పాలభిషేకం చేశారు. మాజీ కౌన్సిలర్లు మదార్ ఆళ్ల భాగ్యరాజ్ కాలంగి రామారావు తిపిరిశెట్టి సుశీల రాజు నెమ్మది దేవమని ప్రకాష్ బాబు సుంకర నాగయ్య రేవూరి సత్యం పాల్గొన్నారు.