మహబూబ్ నగర్ జనవరి 20 (విజయ క్రాంతి) : రైతులకు వరి సాగు భారం కాకూడదని అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉంచేందుకు గాను గ్రౌండ్లతో వరి విత్తనాలు వెదజల్లు కార్యక్రమాన్ని రైతుల ముంగిట తీసుకురావడం జరిగిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్‌రెడ్డి అన్నారు.
దేవరకద్ర నియోజకవర్గం లోని రామన్ పాడ్ గ్రామంలో డ్రోన్ ద్వారా ప్రయోగాత్మ కంగా పొలంలో వరి విత్తనాలు వెదజల్లే కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి, వ్యవసా య విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలతో కలిసి పాల్గొన్న దేవరక ద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వరి నాట్లు రైతుల కు భారంగా మారాయని, నాట్లు వేయడానికి కూలీలు దొరకని పరిస్థితి నెలకొందని ఇతర రాష్ట్రాల నుంచి కూలీల ను రప్పించి.. ఎక్కువ డబ్బులు చెల్లించిన నాటు వేయడాని కి కూలీలు దొరకని పరిస్థితి నెలకొన్న పరిస్థితులను మనం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
డ్రోన్‌తో వరి నాటు విధానానికి ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవి ద్యాలయ శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా రామన్ పాడు గ్రామంలో శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నా రు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు.
వ్యవసాయ నిపుణుల విజ్ఞప్తి మేరకు నియోజకవర్గంలో డ్రోన్లు ఆపరేట్ చేస్తున్న యువ కులకు తన సొంత నిధులతో లైసెన్స్ ఇప్పించేందుకు చర్య లు తీసుకుంటారని ఎమ్మెల్యే జియంఆర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.