17-04-2025 01:55:54 AM
నాగారం, ఏప్రిల్ 16: మహిళలు అన్నీ రంగాలలో రాణించాలని నాగారం మండలం డిప్యూటీ తాసిల్దార్ షాహినా బేగం అన్ని అన్నారు. రైస్ స్వంచంద సంస్థ ఆధ్వర్యంలో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సౌజన్యంతో నాగారం మండల కేంద్రంలో గత మూడు నెలలుగా ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేయగ శిక్షణ తీసుకున్న 30 మహిళలందరికీ ఉచిత కుట్టు మిషన్లు,శిక్షణ పత్రాలు అందజేసి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలు నివసిస్తున్నటువంటి పట్టణాలలో విద్య,జీవనోపాది,ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఇప్పటివరకు 599 మందికి కుట్టు మిషన్లు ప్రతి మహిళ తను నేర్చుకున్న శిక్షణతోఉపాధి పెంచుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధింంచాలని స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా నిలబడాలని,కుట్టు శిక్షణ లో ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకొని మరింత అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ మొగుళ్ళ అమరేందర్ అన్నారు.సంస్థ నిర్వాహకులు మొగుళ్ళ అమరేందర్ గౌడ్ మొగుళ్ళ రమేష్ శోభ తదితరులు పాల్గొన్నారు.