25-03-2025 07:27:12 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండలంలో పలు గ్రామపంచాయతీల్లో అభివృద్ధి పనులకు తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను బూర్గంపాడు ఆర్ఐ నరసింహారావు మంగళవారం తనిఖీ చేశారు. ప్రభుత్వ అనుమతితో ఇసుక తరలిస్తున్న ప్రతి ఒక్క ట్రాక్టర్ కు బ్యానర్, కూపన్ ఉండాలని సూచించారు. అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారితో పాటు పోలీస్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.