నాగల్ గిద్ద (విజయక్రాంతి): నాగల్ గిద్ద మండలంలో, గ్రామాలలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆర్ఐ హనుమంత్ రెడ్డి పరిశీలించారు. శనివారం ఆదివారం రెండు రోజులు ఓటర్ నమోదు కార్యక్రమం ఉంటుందని ప్రతి గ్రామంలో జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి యువకులు ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని వారు తెలిపారు. మండలంలోని పోలింగ్ బూత్ లు పరిశీలించారు. కేంద్రల దగ్గర బిఎల్వో అధికారులు ఓటర్ నమోదు జరుగుతుందని ఆదివారం రోజున పెద్దఎత్తున ఈ అవకాశాన్ని మండలంలోని ప్రతి ఒక్కరు సద్వినియం చేసుకోవాలని కోరారు.