కొత్త తరంతో చిత్రాలు నిర్మించడంలో ప్రత్యేకత చాటడంలో ముందుంటారు దర్శక, నిర్మాత రామ్‌గోపాల్‌వర్మ. ఈ విలక్షణ మూవీ మేకర్ మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘శారీ’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు ‘టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ’ అనేది టాగ్లైన్. సత్య యాదు, ఆరాధ్యదేవి ప్రధాన పాత్రలు పోషించారు. గిరికృష్ణకమల్ దర్శకత్వంలో ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రవివర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్‌లో తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్‌లో మహిళలను అతి క్రూరంగా మానభంగం చేసి, హత్యలు చేసిన ‘శారీ కిల్లర్’ అకృత్యాలను ఈ సినిమాలో చూపించనున్నారు.