calender_icon.png 2 January, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణీలో వచ్చిన ఆర్జీలను త్వరగా పరిష్కరించాలి

30-12-2024 11:21:05 PM

హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య... 

భీమదేవరపల్లి (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఆర్జీలను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రజావాణి కార్యక్రమాన్ని వివిధ శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజల నుండి సమస్యలు పరిష్కరించాలని విన్నవిస్తూ 140 ఆర్జీలను అందజేశారు. జిల్లా ప్రజల నుండి ఆర్జీలను అధికారులు త్వరగా పరిష్కరించి ప్రజలకు జవాబుదారిగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో గణేశ్, ఆర్డీవో రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ, డిఆర్డీవో శ్రీనివాస్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.