హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ నిబంధనలకు విరుద్ధంగా డ్యూటీ ఫ్రీ మద్యం విక్రయిస్తున్న ఆర్‌జిఐఎ కానిస్టేబుల్, హోంగార్డు సహా నలుగురిని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (ఆర్‌జీఐఏ) పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్, హోంగార్డు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను తమకు తెలిసిన వ్యక్తుల వద్ద డ్యూటీ ఫ్రీ లిక్కర్ కలిగి ఉన్నారనే ఆరోపణలపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వారిని పట్టుబడ్డారు.
అరెస్టయిన వారిలో శంషాబాద్‌కు చెందిన ఎం.గేమ్యానాయక్ (37), మాదాపూర్‌కు చెందిన గిర్ధర హరీష్ కుమార్ (24), బంజారాహిల్స్‌కు చెందిన పి రాఘవేంద్రరావు (36), రాజేంద్రనగర్‌కు చెందిన బి లింగయ్య (36)తో పాటు మరో వ్యక్తి ఉన్నారు. మహేశ్వర్ పరారీలో ఉన్నాడు. విమానాశ్రయంలో ప్రోటోకాల్ విధులకు హాజరవుతూ నాయక్, లింగయ్య వరుసగా ఆర్‌జిఐఎ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుళ్లు, హోంగార్డులుగా పనిచేస్తున్నారు.