calender_icon.png 16 January, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరిత్ర తిరగరాసి

16-01-2025 02:14:26 AM

  1. వన్డేల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన భారత అమ్మాయిలు
  2. ప్రతీక రావల్, స్మృతి శతకాల మోత
  3. ఐర్లాండ్‌పై 306 పరుగుల తేడాతో భారీ విజయం
  4. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన మంధాన సేన

3 - వన్డేల్లో భారత్ తరఫున ప్రతీక రావల్‌ది (154) మూడో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు. దీప్తి శర్మ (188), హర్మన్ ప్రీత్ (171*) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 

1 - పరుగుల పరంగా భారత మహిళల జట్టుకు (304) ఇదే అది పెద్ద విజయం. గతంలో ఇదే ఐర్లాండ్‌పై 249 పరుగులతో (2017లో) గెలుపు.

1 - వన్డేల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన స్మృతి మంధాన (70బం తుల్లో). ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ (87 బంతుల్లో) రికార్డు బద్దలు.

రాజ్‌కోట్: భారత వన్డే క్రికెట్‌లో పెను సంచలనం నమోదైంది. మహిళల క్రికెట్ చరిత్రలో మంధాన సేన పాత రికార్డులన్నింటిని తిరగరాసింది. వన్డేల్లో మంధాన సేన భారత్ తరఫున అత్యధిక స్కోరు నమోదు చేయడమే గాక అతిపెద్ద విజయాన్ని అందుకొని చరిత్ర సృష్టించింది. రాజ్‌కోట్ వేదికగా బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు 304 పరుగుల తేడాతో భారీ గెలుపు సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రతీక రావల్ (129 బంతుల్లో 154; 20 ఫోర్లు, 1 సిక్సర్), స్మృతి మంధాన (80 బంతుల్లో 135; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) శతకాలతో విధ్వంసం సృష్టించారు.  అనంతరం భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 31.4 ఓవర్లలోనే 131 పరుగులకే కుప్పకూలింది. సారా ఫోర్బ్స్ (41) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టింది. ప్రతీక రావల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ సొంతం చేసుకుంది.

రికార్డులు కనుమరుగు..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న భారత్ క్రీజులో అడుగపెట్టిన మరుక్షణమే ఐర్లాండ్ బౌలర్లను ఊచకోత కోశారు. ఒకవైపు మం ధాన సిక్సర్లతో చెలరేగితే.. మరో ఎండ్‌లో ప్రతీక రావల్ బౌండరీల మీద బౌండరీలు సాధిస్తూ క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. తద్వారా పలు రికార్డులు కనుమరుగయ్యా యి. ఒక వన్డేలో భారత్ తరఫున ఇద్దరు ఓపెనర్లు సెంచరీలు బాదడం ఇది మూడోసారి గతంలో మిథాలీ రాజ్-రేష్మా గాంధీ జోడీ (1999), దీప్తి శర్మ-రౌత్ జోడీ (2017) శతకాలు సాధించారు.

ఇక తొలి వికెట్‌కు ఈ ఇద్దరి మధ్య నమోదైన 233 పరుగుల భాగస్వామ్యం వన్డేల్లో భారత్‌కు నాలుగో అత్యు త్తమం కావడం విశేషం. ఇక వన్డే క్రికెట్ చరిత్రలో మహిళలు, పురుషుల జట్లు కలిపి ఇప్పటివరకు అత్యధిక స్కోరు 418గా (2011 లో విండీస్‌పై) ఉంది. మహిళల వన్డే క్రికెట్‌లో భారత్‌ది నాలుగో అత్యుత్తమ స్కోరు. 2018లో ఐర్లాండ్‌పై న్యూజిలాండ్ సాధించిన 494 పరుగులు తొలి స్థానంలో ఉంది.