12-03-2025 01:00:38 AM
వైరా, మార్చి 11( విజయక్రాంతి ): దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఆర్దిక హత్య నేరాలకు పాల్పడిన నలుగురు కరుడుగట్టిన దొంగలను 25 రోజులు పాటు శ్రమించి పట్టుకున్న వైరా పోలీస్ అధికారులను అభినందించి, ఖమ్మం జిల్లా సిపి సునీల్ దత్ రివార్డులు అందజేశారు.
ఇటీవల వైరాలోని లీల సుందరయ్య నగర్ లో చోరీకి పాల్పడిన నలుగురు దొంగలను పోలీసులు అదుపు లోకి తీసుకొని విచారించగా ఆశ్చర్యకరమైన అనేక చోరీల విషయాలు బహిర్గత మయ్యాయి. ఆ నలుగురు దొంగలు దక్షిణ భారతదేశంలోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల్లో అనేక చోరీలు చేసినట్లు పోలీసు విచారణలో తేలింది.
అయితే ఈ కేసును ఛేదించేందుకు తీవ్రంగా కృషి చేసిన వైరా సీఐ నూనావత్ సాగర్. వైరా తల్లాడ కొనిజర్ల ఎస్త్స్రలు వంశీకృష్ణ భాగ్యరాజ్ కొండలరావు సూరజ్ వైరా తల్లాడ ప్రొవిషన్ ఎస్త్స్రలు పవన్ వెంకటేష్ తోపాటు మరో 15 మంది పోలీస్ సిబ్బందికి సిపి రివార్డులు అందజేశారు. ప్రాథమిక ఆధారాలు లేని ఈ కేసును త్వరితగతిన సీఐతో పాటు ఎస్‌ఐలను సిపి సునీల్ దత్ ప్రత్యేకంగా అభినందించారు