calender_icon.png 28 April, 2025 | 11:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహబూబాబాద్ టౌన్ సీఐ ‘పెండ్యాల’ కు రివార్డు

28-04-2025 02:19:29 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): టాస్క్ ఫోర్స్ విభాగంలో విధులు నిర్వహించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ పెండ్యాల దేవేందర్  మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా రివార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.