11-02-2025 12:00:00 AM
ఖమ్మం, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి) : అమరజీవి ఆచరణ వాది కర్నాటి యాదగిరి స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం డివిజన్ కమిటీ నాయకులు పేర్కొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో యాదగిరి చిత్రపటానికి పూలేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి ఝాన్సీ మాట్లాడుతూ యాదిగిరి విప్లవ ఉద్యమ నిర్మాణానికి పునాదులు వేసిన మూల స్తంభం లాంటి వాడన్నారు. అనేకమంది కార్యకర్తలను తీర్చిదిద్దార ని, పెత్తందారుల దోపిడీకి వ్యతిరేకంగా బలమైన విప్లవ పోరాటాలను నిర్మించిన కమ్యూనిస్టు యోధుడు అన్నారు.
నేటి యువతరానికి ఆదర్శంగా యాదగిరి నిలిచాడని ఆయన పోరాట వరసత్వాన్ని కొనసాగించాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం డివిజన్ నాయకులు. కంకణాల శ్రీనివాస్, పార్టీ వన్ టౌన్ కార్యదర్శి లెనిన్. పార్టీ టూ టౌన్ కార్యదర్శి సత్తార్మియా, పీవై ఎల్ ఖమ్మం నగర కార్యదర్శి ఎం రవీందర్, పిడిఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి లక్ష్మణ్ వి వెంకటేష్, కే లక్ష్మి, శ్రావణి కంకణాల అరుణ, పిడి ఏసు డివిజన్ అధ్యక్షులు పృద్వి, వెంకటేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.