calender_icon.png 21 September, 2024 | 2:15 PM

ఈఎన్‌టీ రంగంలో విప్లవాత్మక మార్పులు

28-07-2024 12:12:42 AM

అంతర్జాతీయ సమ్మిట్‌లో వక్తలు  

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (విజయక్రాంతి) : మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఈఎన్‌టీ సమ్మిట్‌ను శనివారం నిర్వహించారు. ఈ సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ ఈఎన్‌టీ వైద్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైనాలజీ, స్కల్‌బేస్ సర్జరీలో ప్రఖ్యాత నిపుణులు, మలేషియాకు చెందిన ప్రొఫెసర్ ప్రిపేగెరన్ నారాయణ్ పాల్గొన్నారు. యాంటీరియల్ స్కల్ బేస్, మిడిల్ ఇయర్, మాస్టాయిడ్, ఇన్నర్ ఇయర్ ఇంప్లాంట్, ఎయిర్‌వే మేనేజ్‌మెంట్ వంటి క్లిష్టమైన విషయాలను పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడిసిన్ విద్యార్థులతో పంచుకున్నారు.

ప్రొఫెసర్ నారాయణ్ మాట్లాడుతూ.. ఈఎన్‌టీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, సహకారాన్ని, ప్రాక్టీషనర్ల నైపుణ్యాలకు పెంపొందిచడానికి ఒక గొప్ప వేదికగా ఈ సమ్మిట్ నిలుస్తుందన్నారు. ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ సంపూర్ణ ఘోష్ ఈ సదస్సులో లైవ్ సర్జరీల ప్రక్రియను నిర్వహించారు. మెడికవర్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ శరత్‌రెడ్డి మాట్లాడుతూ.. మారుతున్న పరిస్థితులు, నూతన సాంకేతికతలలో అవసరమైన పరిజ్ఞానం, నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఎలివేట ఈఎన్‌టీ సమ్మిట్ విజయవంతం అయ్యిందన్నారు. మెడికవర్ హాస్సిటల్స్ మెడికల్ డైరెక్టర్ సతీష్ కైలాసం, సుమారు 400 నిపుణులు, యువ వైద్యులు పాల్గొన్నారు.