- బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
లాలాపేటలో బీసీ గురుకులంలో ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 1 (విజయక్రాంతి): గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనే లక్ష్యంగా ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. లాలాపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను, జేబీఎస్ బస్టాండ్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు సకాలంలో భోజన సదుపాయం, ఇతర సౌకర్యాలపై విద్యార్థినీలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో ఎదురవుతున్న సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 26వ తేదీలోగా ఐరన్ ర్యాక్స్, బెడ్స్ అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం జేబీఎస్ బస్టాండ్ పరిసరాలను పరిశీలించారు.
బస్టాండ్ ప్రాంగణంలోని టాయిలెట్స్, దుకాణాలతో పాటు పరిసరాలను పరిశీలించారు. ప్రయాణికులతో ముచ్చటించి సౌకర్యాల గురించి వకాబు చేశారు. ఆయన వెంట జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, హైదారబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఆర్టీసీ చీఫ్ కమర్శియల్ అధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.