calender_icon.png 6 January, 2025 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు

04-01-2025 02:36:55 AM

* ఘనంగా సావిత్రీబాయి ఫూలే జయంతి

* ఉపాధ్యాయుల కృషిని గుర్తించి, ప్రభుత్వం మహిళా టీచర్స్ డేను నిర్వహిస్తోంది:  ఎమ్మెల్యే బండ్ల కృష్ణ  మోహన్ రెడ్డి 

గద్వాల, జనవరి 03 ( విజయక్రాంతి): భవిష్యత్తు తరాల కోసం తమ జీవితాలను త్యాగం చేసి మహిళల విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చిన మహానీయురాలు సావిత్రిబాయి ఫూలే అని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో విద్యా శాఖ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన మహిళా ఉపాధ్యా య దినోత్సవం కార్యక్రమంలో గద్వాల్  శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొని, సావిత్రిబా యి ఫూలే జయంతి సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె చిత్రపటానికి పూలమా లలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళా విద్యా వ్యాప్తికి అపార కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే సేవలను గౌరవిస్తూ, తెలంగాణ ప్రభుత్వం ఆమె జయంతిని జనవరి 3న మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుం దని తెలిపారు. గద్వాల్ జిల్లాను విద్యా, అక్షరాస్యతలో ముందంజలో నిలపడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నా రు.

చిన్నప్పటి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల జీవితంలో మహిళా ఉపాధ్యా యుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని అన్నారు.ఉపాధ్యాయులు చెప్పే మార్గదర్శ కత్వమే గుణం, స్వభావం, లక్ష్యసాధనకు బాటలు వేస్తుందని అన్నారు. తల్లిదండ్రు లు, ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారాని అన్నారు.

ఉపాధ్యాయులు బాల్య వివాహా లను నిరోధించి, మహిళా అక్షరాస్యతను పెంచి, ఉపాధి పెంచే విధంగా పని చేయా లన్నారు. ఉపాధ్యాయులు రోల్ మోడల్‌లు గా ఉండాలని అన్నారు. ఒక అమ్మాయి చదువుతో, ఆ గ్రామం మొత్తం విద్యావంత మవుతుందని, విద్యతోనే సమాజం అభివృ ద్ధి చెందుతుందని అన్నారు.  

ప్రభుత్వం ఉపాధ్యాయుల కృషిని గుర్తించింది: ఎమ్మెల్యే 

 ఉపాధ్యాయుల కృషిని గుర్తించి, ప్రభుత్వం మహిళా టీచర్స్ డేను నిర్వహి స్తోందని తెలిపారు. మహిళల అభివృద్ధి కోసం అన్ని రంగాలలో ప్రభుత్వం ప్రోస్తహి స్తుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి  అన్నారు.  మహిళలకు గౌరవం దక్కే విధంగా ఉపాధ్యాయులు ఫ్యాక్టరీలుగా పనిచేస్తే చాలామందికి విద్యను అందించి న వారు అవుతారన్నారు. 

గ్రామాల్లో బా ల్య వివాహాలను నిర్మూలించేందుకు విద్య ఎంతో అవసరమని, ముఖ్యంగా జిల్లాలోని గట్టు, కేటి దొడ్డి గ్రామాలలో విద్యాభి వృద్ధికి కృషి చేయడం జరుగుతుంద న్నారు. సావిత్రిబాయి పూలే అనుభవించిన కష్టాలు ఈ రోజులలో లేనందున, భవిష్య త్తులో జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలలో విద్యను వంద శాతం అభివృద్ధి పరచాలని కోరారు.

డ్రాప్ అవుట్లు నివారించి, మహిళ లను విద్య,ఉపాధి రంగాల్లో ముందుకు నడిపించాలనే లక్ష్యంతో కృషి చేయాలని అన్నారు.  ఈ సందర్భంగా ఉత్తమ ఉపా ధ్యాయునులుగా ఎంపికైన వారిని ఘనం గా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో అద నపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ, నర్సింగా రావు, గద్వాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్  నల్ల హనుమంతు, అలంపూర్ వ్యవ సాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడప్ప, జిల్లా విద్యా శాఖ అధికారి అబ్దుల్ గని, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ బాబు, అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతి నిధులు, తదితరులు పాల్గొన్నారు.