calender_icon.png 15 November, 2024 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయండి

15-11-2024 12:51:02 AM

హైకోర్టును ఆశ్రయించిన పట్నం నరేందర్‌రెడ్డి 

హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): కేసు పూర్వాపరాలను పరిశీలిం చకుండా వికారాబాద్ జిల్లా కొడంగల్ జెఎ ఫ్సీ జారీచేసిన రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలంటూ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  భూసేకరణ అధికారులపై లగచర్ల గ్రామస్థులు చేసిన దాడి ఘటనతో తనకెలాంటి సంబంధంలేదని పేర్కొన్నారు.

దురుద్దేశంతో, రాజకీయ ప్రేరేపితంగా కేసు నమోదు చేశారని తెలిపారు. లగచెర్లలో అధికారులపై దాడి ఘటనలో నిందితులను పోలీసు అధికారులు అరెస్ట్ చేశారని, వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తనను నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేయడం చెల్లదని చెప్పారు.

అరెస్టుకు కారణాలను కూడా వెల్లడించలేదని తెలిపారు. దాడి ఘటనలో పాల్గొన్న ప్రజలకు, అధికారులకు శత్రుత్వం లేదని, అందువల్ల చంపడానికి ప్రయత్నించారన్న ఆరోపణ సరికాదని అన్నారు. దురుద్దేశం, రాజకీయ ప్రేరేపితంతో తనపై కేసు నమోదు చేశారని, రిమాండ్‌ను కొట్టివేయాలని కోరారు.