పెరుగుతున్న జనాభా కారణంగా పట్టణాలు నానాటికీ విస్తరిస్తు న్నాయి. వీటికితోడు ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటున్న పారి శ్రామిక సంస్కృతి ప్రతి ఒక్కరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాస్తంత ఉక్కపోత తిప్పుకొనేందుకు వీలుగా- పలు వృత్తులు ఉద్యోగాలు, వ్యాపారాల్లో తలమునకలయ్యే వారు కుటుంబసభ్యులతో కలిసి పార్కులకు వెళ్లడం సహజం. శుభ్రత లోపించి కొన్ని, నిర్వహణ కొరవడి ఇంకొన్ని, ఆక్రమణలకు నెలవుగా మరికొన్ని పార్కులు ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. పార్కుల నిర్మాణ లక్ష్యాలు ఫలించేలా చర్యలు తీసుకోవాలి.
- సింగు లక్ష్మీనారాయణ, చింతకుంట