- తెలంగాణ పునర్నిర్మాణంలో చేనేత కీలకం
- చేనేతను ప్రోత్సహించేందుకు చర్యలు
- జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): చేనేత రంగానికి పునరుజ్జీవం కల్పించడాన్ని తమ ప్రభు త్వం బాధ్యతగా భావిస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని నేత కార్మికులకు సీఎం బుధవా రం శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాట సాధనమైన చేనేత, నేటి తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ప్రధానంగా నిలిచిందని అన్నారు. మహిళా శక్తి గ్రూపులు, ప్రభుత్వ శాఖల ద్వారా చేనేతను ప్రోత్సహించే కార్యక్రమాలకు ప్రభు త్వం శ్రీకారం చుటిందని సీఎం పేర్కొన్నారు.