ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): ఇంజినీరింగ్ కాలేజీలకు చెందిన ఆఫ్ క్యాంపస్‌లలో అడ్మిషన్లకు అనుమతి ఇచ్చే అంశాన్ని పునఃసమీక్షించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వా నికి హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. చట్టంలోని అన్ని అంశాలను పరిశీలించి తగిన కారణాలను పేర్కొంటూ నిర్ణయం వెలువరించాలని ఆదేశించింది. ఆఫ్ క్యాంపస్‌లలో అడ్మిషన్లకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం రద్దు చేసింది.
అప్పీళ్లలోని పూర్వాపరాల్లోకి తాము వెళ్లడంలేదని, కాలేజీల దరఖాస్తులను ప్రభుత్వానికే పంపుతున్నామని, వాటిని పరిశీలించి చట్ట ప్రకారం నిర్ణయం తీసుకో వాలని సూచించింది. ఆఫ్ క్యాంపస్‌లలో బీటెక్ కోర్సుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ స్వామి వివేకానంద ఎడ్యుకేషనల్ ట్రస్ట్, వాహిని ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తదితర కాలేజీలు అప్పీళ్లు దాఖలు చేశాయి.