25-04-2025 02:30:39 AM
వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు
హనుమకొండ, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణం అమలు చేయడానికి హన్మకొండ లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో వర్దన్నపేట నియోజక వర్గ పరిధి లోని వరంగల్, హన్మకొండ జిల్లాల కు చెందిన వివిధ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు, బ్యాంకర్ లతో నిర్వహించిన సమీక్ష సమావేశం లో నగర మేయర్ గుండు సుధారాణి తో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొని అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమం లో బల్దియా అదనపు కమిషనర్ జోనా, ఎస్.సి సంక్షేమ శాఖ అధికారి సురేష్, బి.సి సంక్షేమ శాఖ అధికారి రామ్ రెడ్డి, ఎల్డిఏం రాజు, బల్దియా డిప్యూటీ కమిషనర్ లు రవీందర్, ప్రసన్న, రాణి, రాజేశ్వర్, వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్ సుధీర్, ఎంపీడీవోలు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.