calender_icon.png 19 September, 2024 | 7:11 AM

సుప్రీంకోర్టు జడ్జీని పడవి నుంచి తొలగించాలని రివ్యూ పిటీషన్

16-09-2024 08:38:06 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ రద్దు కోసం సుప్రీంకోర్టు జడ్జీ చంద్రచుడ్ ను పదవి నుంచి తొలగించాలని రివ్యూ పిటీషన్ వేసినట్లు మాలమహానాడు ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు జూపాక సుధీర్ సోమవారం తెలిపారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు పసుల రాంమూర్తి సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా అడ్వకేటు గౌతం ద్వారా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రివ్యూ పిటీషన్ వేశారన్నారు. ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ కు అనుకూలంగా రాష్ట్రాలకు హక్కు కల్పించారని, దేశం మొత్తం బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి భారత్ బంద్ చేశామన్నారు. ఎస్సీ వర్గీకరణ 341 ఆర్టికల్ కు విరుద్ధంగా ఉండని, అందుకే సప్రీంకోర్టులో పిటీషన్ వేశామన్నారు. ఢిల్లీలో అడ్వకేటును కలిసిన వారిలో జాతీయ యువజన ప్రధాన కార్యదర్శి మగ్గిడి దీపక్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఆరె దేవకర్ణ, రాష్ట్ర మహిళా కార్యదర్శి గంట భబిత తదితరులున్నారు.