భూపాలపల్లి, జనవరి 10: మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరంలో మే నెలలో నిర్వహించే సరస్వతి పుష్కరాలు, మహా కుంబాభిషేకం, ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో శుక్రవారం దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకు ముందు కుటుంబ సభ్యులతో కలిసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే నెల 7 నుంచి 9 వరకు మహా కుంబాభిషేకం నిర్వహించనున్నట్టు తెలిపారు. భక్తు లకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించా రు.
సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, ఆలయ ఈవో మారుతి, రీజినల్ కమిషనర్ రామకృష్ణారావు, డివిజనల్ పంచాయతీ అధికారి వీరభద్రయ్య, దేవాదాయ శాఖ పరకాల డివిజన్ ఇన్‌స్పెక్టర్ కవిత పాల్గొన్నారు.